my heart


Thursday, December 20, 2012

నన్ను నిజంగా కోల్పోయానని

చెలీ.. నా ఏకాంతం లో తోడు వైనావు;
నా ఆవేదనలో ఓదార్పు వైనావు;
నా ఆనందంలో ఆత్మియతైనావు;
నా దారిలో నీడవైనావు;
నా మనసులో జ్యోతి వైనావు;
నా ప్రతి కల లోను నువ్వున్నావు;
కానీ వాస్తవంలో కలవైనావు;
నా ప్రతి జ్ఞాపకంలో నువ్వున్నావు;
కానీ ఓ జ్ఞాపకంగానే మిగిలిపోయావు;
ప్రియా నా కళ్ళలో పదిలంగా ఓడిగిపోయావు;
కాని అంతలోనే కన్నీరులా కరిగిపోయావు;
ప్రియా ఆకాశమంత ఆప్యాయతను చూపించావు;
చివరకు అంధకారం మిగిల్చి వెళ్ళిపోయావు;
తొలకరి చిరుజల్లులా చేరువయ్యావు;
ప్రియా కల్లోల కడలిలా అలజడి రేపి వెళ్ళిపోయావు;
కడదాక తోడుంటా నన్నావు;
కన్నీటి రుచి చూపించావు ప్రియా;
నేను లేకుండా నువ్వు సుఖంగా
ఉంటానను కుంటున్నావు ప్రియా;
కాని ఏదో ఒక రోజు నువ్వు తెలుసు కుంటావు,
ప్రియా నా అంత ప్రేమ నీకు ఎక్కడా దొరకదని,
నన్ను నిజంగా కోల్పోయానని

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect