my heart


Thursday, December 20, 2012

ఎలా మిత్రమా నిన్ను నే మరిచేది...

నీ అల్లరి మాటలు...
అమాయకమైన నీ చూపులు...
ప్రియా నిత్యం నీ పెదాలపై 
చిందులేసే ఆ చిరునవ్వులు
నా గుండే చప్పుడై 
ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంటే....
ఎలా మిత్రమా నిన్ను నే మరిచేది...
బ్రతికున్నా.. శవంలా బ్రతికేది...

ప్రియా నీతో అప్యాయంగా
మాట్లాడినన ఆ మధురక్షణాలు
నీతో అల్లరిగాపడ్డ ఆ గొడవలు..
ప్రతిసారీ నీ అలకలు...
పెద్ద ఆరిందిలా నీవు ఇచ్చిన సలహాలు
నేనున్నా అంటూ నీవు చెప్పీన దైర్యం
నా సెల్ నెంబర్ లో 143 ఉంది
నీది నిజమైన ప్రేమ అన్నావు
నాకు అందరూ దూరం అవుతారు
నీవుకూడా అలా అవుతావేమో అంటే
నిన్ను ఎప్పటికీ వీడను..
మనం ఎప్పుడూ ఇలాగే ఉంటావు అన్నావు

ప్రియా ఆ నీ ముతి ముడుపులు...
అనుక్షణం నా నీడల్లే వెంటాడుతుంటే
నిముషమైనా నిలువ లేక పోతున్నా ....
నిను తలువ కుండా...
ప్రియా కలలోను కలవరపెడుతుంటే...
కన్నీరై కారుతూ గుండెల్నితాకుతుంటే...
లోలోపలే సమాధి చేసుకున్న
ప్రియా నీ జ్ఞాపకాలను తడుముతూ
మరువాలని ప్రయత్నిస్తున్న నాకు...
మళ్ళి మళ్ళి గుర్తుచేస్తుంటే..
ఎలా మిత్రమా నిన్ను నే మరిచేది,
గుండెలోని నీ గురుతుల్ని శాశ్వతంగా చెరిపేసేది....
బ్రతికున్నా.. శవంలా బ్రతికేది...ప్రియా

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect