సినిమా గెలవాలంటే ఐటంసాంగ్......
కిక్ ఎక్కాలంటే కోక జారాల్సిందే ....
కలెక్షన్లు రావాలంటే వి(వ)లువలు ఊడాల్సిందే.....
అంత చూపినా ఏదో, ఎక్కడో నిరాశ.....,
ఎక్కడో చిన్న అసంతృప్తి.....
అదేమంటే.... మేం కాదా యంగ్....
ఇప్పుడు కాపోతే మరెప్పుడు??? అంటు౦టారు ..
చివరికి దేవాలయపు ఉత్సవాలకి కూడా
అర్ధనగ్న నృత్యాలే, భోగం మేళాలే....
వ్యాపారం పెరగాలంటే
కను'విందు చేయాల్సిందే......
స్నేహితుణ్ణి పిలవాలన్నా
అశుద్ధంతో పలకాల్సిందే ...
పిల్లల్ని గదమాలన్నా
నోట్లో నానే బూతు కావాలి....,
పొరపాటున చిరు దెబ్బ తగిలినా
నోటికి అశుద్ధం పూయాల్సిందే.....
అంతులేని బాధకీ ,
అతిధిగా వచ్చిన సరదాకి మందు కావాలి ...
మందులో పడితే విందు కావాలి ...
విందు తో పాటు పొందూ కావాలి...
అనుభవించే స్తోమత,దమ్ము లేనప్పుడు చూస్తూ సొల్లు కార్చాలి .....
లేదా...,
ఎవరు అప్పనంగా దొరుకుతారా అని ఎదురు చూస్తూ
మృగాల్లా ఎగబడాలి... కనబడ్డ వారందరిపై కక్కుర్తి చూపించాలి ...
వయసు ఆకర్షణకి కామపు రంగు పులుమి,
నాగరికత హంగులద్డుతూ, నవీన భాష్యం చెప్పుకుంటూ
అంగాంగ ప్రదర్శనలంటే అంతులేని మోజు చూపిస్తూ ...
దేహాల దాహాలకై అర్రులు చార్చటమే రివాజు కానిస్తూ ...
ఇలా అశ్లీలాన్ని శీలంలో కలిపేసుకుని ,
అసమర్ధతని , శీలానికి అంటు కట్టేసుకుని
అణా కానీ విలువ చేయని వ్యక్తిత్వాన్ని
ఆహా ఓహో అంటూ ఎత్తేసుకుని
తమ జబ్బలు తామే చరుచుకుంటూ,
తమ గొప్పలు తామే చెప్పుకుంటూ,
అదేమంటే కాలంతో పాటు మనమూ మారాలి
అంటూ సు(అ)భాషితాలు చెప్పుకుంటూ బతికేసే...
ఓ అమ్మకి కొడుకుల్లారా .!.!.!
మరో సోదరి తోబుట్టువుల్లారా .!.!.!.!
ఇంకో ఆలికి మొగుళ్ళారా.!.!.!.!.!
ఆలోచించండి......
జనబాహుళ్యంలోనికి చొచ్చుకుపోయిన
విష సంస్కృతి కసి పు౦గవుల్లారా...
ఆలోచించండి...
"చూసే కన్ను కలుషితం,
మాటాడే నోరు కలుషితం ......"
మరి మనకు ఎదురయ్యే సమాజం ఎలా పునీతంగా ఉంటుంది???
సరదా మాటల్లోని ప్రతి బూతూ ...,
కర్కశ స్వభావానికి దారి తీస్తుంది ....
కోరికకి పునాది పరుస్తుంది...
అందాలమ్మట కార్చే ప్రతి చొంగా .....
నీవైపే గురి పెడుతుంది....
విషపు చుక్కై నీ అక్కా చెల్లెళ్ళవైపే దాడి చేస్తోంది....
లేదు లేదు మేం బుద్ధిమంతులమే , అందరిపై గౌరవం ఉంది,
ఏదో సరదాకి అలా అలా అంటుంటాం , చేస్తుంటాం .... అంతే....
అని ఎవరికీ వారు సర్ది చెప్పుకుంటే మాత్రం...,
నీలాంటి వాడు రేపు నీకు జరగబోయే అన్యాయానికి కారణం అవుతాడు
నీలాంటి వేరోడికి జరిగే నష్టానికి నీవు ముద్దాయివి అవుతావు..
కనుక
మారుతావో, బలౌతావో,
మార్చుతావో, నీ శీలాన్ని తార్చుతావో....
అంతా నీ చేతుల్లోనే........

Get Flower Effect
No comments:
Post a Comment