my heart


Thursday, November 29, 2012

ఒకేసారి వరించింది కదా ప్రియా.


మనసులో
కలుగుతున్న భావాలెన్నో
ఏ రూపం లేకుండా అలానే
గతిస్తున్నాయినా అక్షరాలు
కొంత కాలం గా అజ్ఞాతం చేస్తున్నాయి
మరిభావానికి రూపాన్నిచ్చే
భాషఆమె మాయలో పడి
లిపిని మరచిపోయింది
ప్రేమ మత్తు అటువంటిది
మరిభావాలకి రూపాన్నిచ్చి
గుండెబరువు దించుకునే క్షణం
ఎప్పుడొస్తుందో మరి?
నన్ను తాకిన
ఆ తీయని భావన
నీ వరకూ చేరలేదా?
ఇద్దరమూ ఒకే దారిలో పక్కపక్కనే
పయనిస్తున్నాము కదా...
నా స్నేహపు కొమ్మకి ప్రేమ చిగురులు
తొడిగాయినువ్వింకా
మోడుగానే వున్నావేమిటి?
ఇద్దరిని వయసు వసంతం
ఒకేసారి వరించింది కదా ప్రియా.

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect