my heart


Wednesday, July 25, 2012

ఒక స్నేహం ఇలా ముగిసింది..


అలా  మొదలైన మా స్నేహం ఇంత తొందరగా  ముగుస్తుంది అనుకోలేదు...
అసలు ఇంత తొందరగా మా స్నేహం ముగుస్తుంది అని తెలిసుంటే నేనసలు ఆ రోజు మాట్లాడే వాడిని కాదేమో...
మాట్లాడటం తప్పయితే మా స్నేహం వీడిపోవటానికి  కారణం నేనే...

ఇంతక ముందు అప్పుడెప్పుడో నేను రాసాను కదా బస్సు లో కొత్త ఫ్రెండ్  పరిచయం  అయ్యారు అని.. 
ఆ ఫ్రెండ్ గురించే మల్లి రాయాల్సి వస్త్తుంది  అని నేననుకోలేదు....
అసలేం జరిగిందంటే ఆ రోజు తర్వాత తనని నేను మొత్తానికి   నాలుగు సార్లు చూసాను..
రెండు సార్లు కలిసాను కుడా.....

ఫోన్ చేస్తే  తను బాగానే  మాట్లాడేది ,  ఏమైందో తెలియదు ఉన్నట్లుండి  మాట్లాడటం మానేసింది 
మల్లి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేది కాదు, వేరే  నెంబర్ నుండి చేస్తే మాత్రం లిఫ్ట్  చేసి బిజీగా  ఉన్నాను  తర్వాత మాట్లాడతాను  అంటుండేది..
అలా చాలా  సార్లు ఎదురు చూసాను ఫోన్ చేసిన ప్రతి సారి నాకు నిరాశే మిగిలింది...
నేను తనకి చాల సార్లు చెప్పను కూడా.. 
ఏమైనా  ప్రాబ్లం  ఉంటే డైరెక్ట్ గా  నాతో చెప్పు అని కాని అలాంటివి ఏమి లేవు  అంటుండేది...

చివరికి ఒక రోజు చెప్పేసింది  నీతో మాట్లాడటం ఇష్టం లేదు  అని...

తను మాట్లాడటం  ఇష్టం లేదు అన్నందుకు నేనేమి భాదపడట్లేదు 
ఏ కారణం లేకుండా ఇలా ఎందుకు  విడిపోయిందో  నాకిప్పటికి మిలియన్ డాల్లర  ప్రశ్నే..
కాని నాకొక్కటే అర్థం కాలేదు ఇంత తొందరగా  ఇష్టాలు ఎలా మారిపోతాయి అన్నది....
నిజం చెప్పాలంటే తన మీద ఎందుకో నాకెప్పుడు కోపం రాలేదు,  ఇప్పటికి, ఎప్పటికి.. 
ఎందుకంటే తను నా ఫ్రెండ్ అని నేనెప్పుడో డిసైడ్ అయ్యాను కాబట్టి 
ఒక్కటి మాత్రం నిజం, 


తను నన్ను మర్చిపోయినా తనని మాత్రం నా జీవితాంతం గుర్తుంచుకుంటాను ఎందుకంటే తను నా మనసులో మిగిలిపోయింది,నాకు ఇష్టమైన  వ్యక్తుల  సరసన...

తానొక్కతే  కాదు ఇలా మనం చాల మందిమి చాల సార్లు ఇలానే చేస్తుంటాము కదా అవతలి వాళ్ళు ఏమవుతారు అని ఆలోచించకుండా......  

ఇలా మీ జీవితంలో కూడా జరిగే ఉంటాయి కాదు...

ఒక్క సారి ఆలోచించండి...

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect