my heart


Thursday, November 29, 2012

నా మనసుని తీసుకెళ్ళిపొయిందనా?

ఏమని సమాధానం చెప్పను,
సాగరతీరంలొ ఒంటరిగా నడుస్తున్న 
నన్ను చూసి ఆ కెరటాలు ప్రశ్నించాయి,
నీతో నడిచే నీ తొడు ఏమయిందని,
సాయంసంధ్యవేళ అస్తమించే 
సూర్యుడు అడిగాడు,
నీ వెన్నెల కనిపించటంలేదేంటని,
నిన్ను వెతికే నా కళ్ళు అడిగాయి,
నీ మనసు దోచిన అందమేదని,
నాతో నడిచే నా నీడ అడిగింది,
తనతో నడిచిన తొడు ఏమయిందని?
ఏలా సమాధానం చెప్పను వాటికి,
కన్నీళ్ళను కానుకగా వదిలి తను వెళ్ళిపొయిందనా?
గుండెలొ మంటరేపి వెళ్ళిపొయిందనా?
మనసును ఒంటరిని చేసి వెళ్ళిపొయిందనా?
నన్ను కాదని వదిలి వెళ్ళిపొయిందనా?
ఏమని చెప్పను తను ప్రేమను వదిలి
నా మనసుని తీసుకెళ్ళిపొయిందనా?
మూగబొయిన మనసులో మాటలు మాయమయ్యాయి.
మౌనమే సమాధానం అయ్యింది.

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect