my heart


Friday, August 10, 2012


ఓ ప్రియా
నీ పలుకులే లేని 
రోజులెంత శూన్యంగా గడుస్తున్నాయే 
ఎలా తేలపాలను కున్నా విలులేకున్నది గా 
                          నేస్తం
మదిలోని మౌన సంఘర్షణ తెలుపు దారేదో చెప్పమని 
చందమామ తో కాసేపు ఊసులాడెను 
నా విరహాన్ని వెన్నెలతో కలిపి నీపై
      ఒలికించగలన  ప్రియా!
మరి నీకిది అర్ధమైందో లేదో,నాకాస్తా తెలపవు 
నీతో కలిసి సంచరించమని నా ఊపిరిని 
చిరుగాలికిచ్చి తోడు పంపాను 
      అదేపుడైన అలవాటులో పొరపాటుగా 
నీ ముని వేళ్ళతో దోబూచు లాడితే  
            నీవు విసురుగా కసురుకుంటే
చిన్న బుచుకోవద్దని   బ్రతిమిలాడాను 
ఇక్కడ నీ ఊసులే లేని నా ఊపిరంతా వేదనా భరితమై 
నీ కేలాగైనా తెలపాలి అని వున్నా
               ఇంత కన్నా వీలు లేకున్నాదిగా నేస్తం
ఎలా తెలుపను..............
                       ప్రియా
    నా యదలోని భావన ,కలిగే 
               నా మనస్సు సంఘర్షణ !

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect